పత్రికా ప్రకటన
*కరోనాను జయించిన నలుగురు డిశ్చార్జ్*
*జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్*
విశాఖపట్నం,ఏప్రిల్ 8: కోవిడ్-19 బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న నలుగురు వ్యక్తులను పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి విడుదల చేయడం ఆనందంగా వుందని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు పద్మనాభం మండలం, రేవిడి గ్రామం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులని, మిగిలిన ఇద్దరు విశాఖ నగరం అల్లిపురానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా ఆయన చెప్పారు. వీరిలో మొట్ట మొదటగా నెగిటివ్ వచ్చిన వ్యక్తిని గతవారం డిశ్చార్జి చేశామని, మిగిలిన ముగ్గురికి నెగిటివ్ వచ్చినందున వారిని ఈరోజు డిశ్చార్జి చేసినట్లు వివరించారు.
జారీ ఉపసంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విశాఖపట్నం