manthri haami

పత్రికా ప్రకటన 


ఏ ఒక్కరూ ఆకలితో  ఉండకూడదు 


రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 


విశాఖపట్నం,ఏప్రిల్, 10:  ఏ ఒక్కరూ ఆకలి తో ఉండకూడదని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం భీమిలి నియోజకవర్గం విశాఖపట్నం 6వ వార్డు లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 సందర్భంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పేదవారికి రేషన్, ఖర్చులకు వెయ్యి రూపాయలు ఉచితంగా అందించినట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి రేషన్, వేయి రూపాయలు అందుతాయని చెప్పారు.  రేషన్ కార్డ్ లేకుండా పేద ప్రజలు ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు, భోజన సదుపాయాలు కల్పించాలని జోనల్ కమీషనర్ ను ఆదేశించారు. అవసరమైతే తన సొంత నిధులతోనైనా పేదలకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఆయా వార్డుల్లో ఆయన పర్యటించి అక్కడి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. 
ఆరో వార్డులో పేదవారికి ఉచితంగా భోజనం పొట్లాలను భౌతిక దూరం పాటించి మంత్రి వద్ద నుండి ప్రజలు అందుకున్నారు.


జారీ : ఉప సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విశాఖపట్నం.